నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఎడ్‌బిడ్ గ్రామంలో శుక్రవారం రాత్రి మల్లన్న కల్యాణ మహోత్సవంతో జాతర ప్రారంభమైంది. వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య కల్యాణ తంతును ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు స్వామి అమ్మవార్లకు అభిషేకం, మంగళహారతి నిర్వహించిన అనంతరం బంగారు ఆభరణాతో అలంకరించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కల్యాణ వేడుక నిర్వహించారు.
ఈ ఉత్సవానికి గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. తమ గ్రామంలో మల్లన్న స్వామి జాతర వైభవంగా జరుగుతుందని.. మాఘపౌర్ణమికు ఒకరోజు ముందు స్వామి కల్యాణం నిర్వహిస్తామని చెప్పారు. ఈ జాతర 5 రోజుల పాటు జరుగుతుందని ప్రతి రోజు ప్రత్యేక పూజలు నిర్వస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి: నేటితో ముగియనున్న మేడారం చినజాతర