నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో గోదావరి నది తీరాన తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో గోదావరి తల్లికి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఉదయం నుంచే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు పిండివంటలు తయారు చేసి తెప్పపై నైవేధ్యాలు సమర్పించారు. మొక్కులు తీర్చుకున్నారు.
ఇవీ చూడండి: 'తుది తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీ ఎన్నిక జరపొద్దు'