నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలోని బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ అడుగుజాడల్లో నేటి యువతరం నడవాలని, అహింసా మార్గంతోనే స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీ అని సర్పంచ్ వీరేష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సామ రాజేశ్వర్ రెడ్డి, ఈఓ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: బాపూజీ నడిచిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి: జస్టిస్ చంద్రయ్య