రాష్ట్రంలో ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని నిర్మల్ జిల్లా భైంసాలోని అటవీ అధికారులు, న్యాయవాదులు సూచించారు. భైంసా పట్టణంలోని కోర్టు ఆవరణలో అటవీశాఖ అధికారులు, న్యాయవాదుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. అటవీ సంపద తగ్గుముఖం పడుతున్నందున మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలసిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.
ఇవీ చూడండి: కొత్త పురపాలక చట్ట ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం