ఆర్టీసీ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొండివైఖరికి నిరసనగా నిర్మల్ జిల్లా కేంద్రంలో వామపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిన్న జరిగిన రాష్ట్ర బంద్కు స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రజలు మద్దతు తెలిపినా... ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులను చర్చకు పిలవడం లేదన్నారు. హైకోర్టు తీర్పును కూడా ముఖ్యమంత్రి లెక్కచేయకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ 'వైష్ణవ జనతో' గీతం అద్భుతం: గవర్నర్ తమిళి సై