రైతులను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని తెలంగాణా వ్యవసాయ కార్మిక సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు నందిరామయ్య విమర్శించారు. సాగు చట్టాలు వెంటనే రద్దు చేయాలని కోరుతూ దిల్లీలో చేపట్టిన కిసాన్ మజ్దూర్‌కు మద్దతుగా.. జిల్లా కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు.
గాంధీ పార్క్ నుంచి మినీ ట్యాంక్‌బండ్ వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల కార్పొరేట్లకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని ఆరోపించారు.
చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజన్న, సురేశ్, విలాస్, ఎస్.ఎన్ నారాయణ, జీఎస్ నారాయణ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: దిల్లీ రైతు ఉద్యమానికి మద్దతుగా ట్రాక్టర్ ర్యాలీ