ETV Bharat / state

నిర్మల్​ కాలేజీలో అన్నీ బాగున్నాయి... అదొక్కటే లేదు - college

అత్యుత్తమ విద్యా బోధన, విశాలమైన భవనం, ఎటు చూసినా పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఇంతకన్నా ఏమి కావాలి. ఏటా పెరుగుతున్న అడ్మిషన్లతో పాటు పెరుగుతున్న ఉత్తీర్ణతా శాతంతో విజయపథంలో దూసుకుపోతోంది నిర్మల్​ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్​ కళాశాల. కానీ ఇక్కడ వసతి సౌకర్యం లేకపోవడం వెలితిగా ఉంది. ఈ ఒక్క కారణంతోనే పెద్ద సంఖ్యలో దూర ప్రాంత విద్యార్థులను తిరస్కరించే పరిస్థితి తలెత్తడం శోచనీయం. పాలకులు స్పందిస్తే జిల్లా వాసులకు చక్కని విద్యాసౌధంగా విరాజిల్లుతుంది.

నిర్మల్​ కాలేజీలో అన్నీ బాగున్నాయి... అదొక్కటే లేదు
author img

By

Published : Jul 26, 2019, 9:16 PM IST

నిర్మల్ ​జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్​ కళాశాల అంటే చక్కని విద్యా ప్రమాణాలకు కేరాఫ్​గా మారింది. ఏటా విద్యార్థుల సంఖ్య పెరగడమే కాకుండా అత్యుత్తమ విద్యా ప్రమాణాలు అందిస్తూ ఉత్తీర్ణతా శాతంలో దూసుకుపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్​, నిజామాబాద్​ జిల్లాల నుంచి ఈ కళాశాలలో చేరేందుకు వందల సంఖ్యలో విద్యార్థినిలు దరఖాస్తు చేసుకుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ కళాశాలకు వసతి గృహం లేకపోవడం ఓ వెలితిలా ఉండిపోయింది.

కళాశాలలో తెలుగు, ఆంగ్లము, ఉర్దూ మాధ్యమాల్లో అన్నిరకాల మాధ్యమిక, వృత్తి విద్య కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇంతవరకు బాగున్నా తరగతి గదులు సరిపడినన్ని లేకపోవడం వల్ల ఆరుబయట చెట్ల కింద పాఠాలు చెబుతున్నారు. దూర ప్రాంత విద్యార్థినుల కోసం వసతి గృహం లేదు. ఇరుకు గదుల్లో విద్యార్థినిలు తీవ్ర ఇంబ్బంది పడుతున్నారు.

వసతి గృహం లేక వెళ్లిపోతున్నారు

విద్యార్థినిలు ఈ కళాశాలలో చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నా వసతి సౌకర్యం లేకపోవడం, అద్దె గదుల్లో ఉండి చదువుకోలేని పరిస్థితిలో ప్రవేశాలు పొందలేక పోతున్నారు. ఈ ఏడాది సుమారు 120 మంది వసతి సౌకర్యం లేక టీసీ తీసుకుని వెళ్లిపోయారని ప్రిన్సిపల్​ చెబుతున్నారు. ఇంత మంచి పేరు ప్రతిష్ఠలున్న ఈ కళాశాలకు మరిన్ని వసతులు కల్పిస్తే ఎందరో విద్యార్థులకు మేలు జరుగుతుందని అధ్యాపకులు, విద్యార్థులు కోరుకుంటున్నారు. అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలంటున్నారు.

నిర్మల్​ కాలేజీలో అన్నీ బాగున్నాయి... అదొక్కటే లేదు

ఇదీ చూడండి: ఆర్థిక అభివృద్ధే కాదు... మానవసంబంధాలూ పరిపుష్టం

Intro:TG_ADB_31_26_PRABHUTVA_KALASHALA_PKG_TS10033
TG_ADB_31a_26_PRABHUTVA_KALASHALA_PKG_TS10033
TG_ADB_31b_26_PRABHUTVA_KALASHALA_PKG_TS10033
TG_ADB_31c_26_PRABHUTVA_KALASHALA_PKG_TS10033
వద్దన్న ప్రవేశాలు ..వసతి గృహం లేక తిరస్కరణ..
అవకాశం ఉన్న చేర్చుకో లేని దుస్థితి..
ఇది నిర్మల్ ప్రభుత్వ బాలికల మాధ్యమిక కళాశాల పరిస్థితి..
గమనిక .. స్క్రిప్ట్ ఎఫ్.టి.పి ద్వారా వచ్చినది..

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ హిట్ నంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.