ETV Bharat / state

ఆదివాసీల ఆరాధ్య దైవం కుమురం భీం : మాజీ ఎమ్మెల్యే - నిర్మల్​ జిల్లా తాజా సమాచారం

ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన యోధుడు కుమురం భీం అని మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​రెడ్డి అన్నారు. నిర్మల్​ జిల్లా కౌట(కె) గ్రామంలో ఆదివాసీ నాయక్ పోడ్​ సంఘం ఏర్పాటు చేసిన కుమురం భీం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

kumuram bheem statue inaugurated in nirmal district
ఆదివాసీల ఆరాధ్య దైవం కుమురం భీం : మాజీ ఎమ్మెల్యే
author img

By

Published : Nov 8, 2020, 10:07 PM IST

నిర్మల్​ జిల్లా కౌట(కె) గ్రామంలో ఆదివాసీల ఆరాధ్య దైవం కుమురం భీం విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​రెడ్డి ఆవిష్కరించారు. ఆదివాసీల హక్కుల కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయని ధీరుడు కుమురం భీం అని కొనియాడారు.

ఆదివాసీ నాయక్​ పోడ్​ సంఘం ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కుమురం భీం ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పోరాటం చేయాలని మహేశ్వర్​రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు భూమయ్య, ఉప సర్పంచ్​ నర్సారెడ్డి, దిలావర్​పూర్​ జడ్పీటీసీ రమణరెడ్డి, సోన్​ ఎంపీపీ మానస హరీశ్​రెడ్డి, మండల అధ్యక్షులు జమాల్​, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ధాన్యం ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు.. రైతుల ఆందోళన..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.