Khanapur MLA Rekha Nayak Resigns BRS : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో మహిళలకు తగిన గౌరవం ఇవ్వడంలేదని.. అందుకే మహిళ అని కూడా చూడకుండా తనను పక్కన పెట్టరాని ఆరోపించారు. పార్టీ కోసం నియోజకవర్గంలో ఎంతో కృషి చేశారని, అభివృద్ధి కోసం ఆరాటపడ్డారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కేటీఆర్ స్నేహితుడైన జాన్సన్ నాయక్‌కు టికెట్ ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు.
MLA Rekha Naik Congress Ticket : కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న MLA రేఖా నాయక్
శుక్రవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. జాన్సన్‌నాయక్ ఖానాపూర్‌లో ఎలా గెలుస్తారో చూస్తానని బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. నియోజకవర్గంలో 200 కోట్లతో అభివృద్ది చేస్తామని నిధులు మంజూరు చేసి.. ఇప్పుడు ఆ పనులను నిలిపివేసారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీయా లేదా వేరే పార్టీలో చేరడమా.. తదుపరి కార్యచరణను త్వరలో ప్రకటిస్తానని స్పష్టం చేశారు.
Kalwakurthy MLC Kasireddy Resigns BRS : ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ సహా ఇతర పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు హస్తంపార్టీ బాట పడుతున్నారు. తాజాగా కల్వకుర్తి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తన అనుచరగణంతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అచ్చంపేట నియోజక వర్గంలోనూ పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.
-
Today, in the presence of Congress President Shri @Kharge, BRS leaders Shri Kasireddy Narayana Reddy & Shri Thakur Balaji Singh, along with 100 current & former elected representatives from the Kalwakurthy Assembly Constituency, Telangana join the Congress Party. pic.twitter.com/XHWim2vtt3
— Congress (@INCIndia) October 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Today, in the presence of Congress President Shri @Kharge, BRS leaders Shri Kasireddy Narayana Reddy & Shri Thakur Balaji Singh, along with 100 current & former elected representatives from the Kalwakurthy Assembly Constituency, Telangana join the Congress Party. pic.twitter.com/XHWim2vtt3
— Congress (@INCIndia) October 6, 2023Today, in the presence of Congress President Shri @Kharge, BRS leaders Shri Kasireddy Narayana Reddy & Shri Thakur Balaji Singh, along with 100 current & former elected representatives from the Kalwakurthy Assembly Constituency, Telangana join the Congress Party. pic.twitter.com/XHWim2vtt3
— Congress (@INCIndia) October 6, 2023
తన అనుచరులతో కలిసి దిల్లీకి వెళ్లిన కసిరెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ నేత వంశీచంద్‌రెడ్డితో కలిసి ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లారు. పార్టీలో చేరేందుకు వచ్చిన నేతలకు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ఇతర నాయకులు స్వాగతం పలికారు. బీఆర్ఎస్లో ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించారు. కేసీఆర్ ఇటీవల ప్రకటించిన జాబితాలో కల్వకుర్తి టికెట్ సిట్టింగ్ ఎమ్మేల్యేకే ఇవ్వటంతో కసిరెడ్డి అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపిన ఆయన.. బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నియోజక వర్గాల వారీగా గమనిస్తే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, గద్వాల నియోజకవర్గం నుంచి జడ్పీ ఛైర్పర్సన్ సరిత, వనపర్తి నియోజకవర్గం నుంచి మంత్రి నిరంజన్ రెడ్డికి ప్రధాన అనుచరునిగా ఉన్న పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, కొడంగల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ఇలా కీలకమైన నేతలంతా కాంగ్రెస్ లో చేరారు.
Joinings in Telangana Congress : నేటి నుంచి కాంగ్రెస్‌లో చేరికల కోలాహలం..