జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.యం. అబ్రహం పంపిణీ చేశారు. రూ. 42 లక్షల 79 వేల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఏ పేదింటి తల్లిదండ్రులు అమ్మాయి పెళ్లి కోసం ఇబ్బంది పడకుండా ఈ పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండల అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల ఛైర్మన్లు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కేన్ విలియమ్సన్ రికార్డు డబుల్ సెంచరీ