నిర్మల్ కొయ్య బొమ్మల నేపథ్యంలో రూపొందించిన రాధాకృష్ణ సినిమాను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్లో ప్రదర్శిస్తున్న రాధకృష్ణ సినిమా మొదటి షోను ఆయన వీక్షించారు.
నిర్మల్ కొయ్య బొమ్మల చరిత్ర అంతరించి పోకుండా కొయ్య బొమ్మలు తయారుచేసే నకాషీ కళాకారుల జీవన విధానం కళ్లకు కట్టినట్టు సినిమా ఉందని ప్రశంసించారు. కళాకారుల శ్రమ గురించి ఒక మంచి సినిమా తీసినందుకు చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరు సినిమాను చూసి ఆదరించాలని.. మూవీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఇందులో జడ్పీ ఛైర్ పర్సన్ విజయ రాంకిషన్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ముత్యం రెడ్డి, తదితరులున్నారు.
ఇదీ చూడండి: 'ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ యథాతథం'