ETV Bharat / state

'కబ్జాదారుల నుంచి ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను కాపాడాలి' - indiramma house lands in nirmal district

భూ కబ్జాదారులు నుంచి ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను కాపాడాలని భాజపా నిర్మల్​ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు కోరారు. జిల్లా కేంద్రంలోని బంగల్​పేట్ మహాలక్ష్మి ఆలయ సమీపంలో ఇళ్ల స్థలాలను భాజపా నాయకులు పరిశీలించారు.

indiramma house lands in nirmal district visited by bjp leaders
'కబ్జాదారుల నుంచి ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను కాపాడాలి'
author img

By

Published : Oct 3, 2020, 2:01 PM IST

నిర్మల్​ జిల్లా కేంద్రంలోని బంగల్​పేట్​ మహాలక్ష్మి ఆలయ సమీపంలో పేదలకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను కొందరు కబ్దాదారులు ఆక్రమించారని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు ఆరోపించారు. 2007లో ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించిందని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల వలన ఇళ్లు నిర్మించుకోలేని లబ్దిదారుల స్థలాలను కొందరు భూకబ్జాదారులు బలవంతంగా ఆక్రమించుకుంటున్నారన్నారు.

పేదలకు కేటాయించిన భూములను అధికారులు కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కమల్ నయన్, జిల్లా కార్యదర్శి గాదే విలాస్, పట్టణ అధ్యక్షులు అయ్యన్నగారి రాజేందర్, నాయకులు అనుముల శ్రవణ్ అల్లం భాస్కర్, కోటగిరి గోపి, గందే రాకేశ్, గిల్లి విజయ్, శ్రవణ్, సంతోష్ రాజ్, అజయ్, నరేష్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పుంజుకుంటున్న ఆధార్​ సేవలు.. పునఃప్రారంభమైన కార్డుల జారీప్రక్రియ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.