నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కనపర్తి విగ్నేష్ రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అనూష, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నిర్మల్ అయ్యప్ప సేవా సమితి వారు ప్రజలందరికీ కేరళ ఆయుర్వేద మందులను పంపిణీ చేయడం అభినందనీయమని మెజిస్ట్రేట్ అనూష అన్నారు. నిరుపేద ప్రజల అవసరాలను గుర్తించి వారికి ఆర్థిక సాయం చేయాలని సూచించారు. మరెన్నో అసోసియేషన్లు ముందుకు వచ్చి కరోనా కారణంగా ఆకలితో అలమటిస్తున్న వారికి సాయం చేయాలని అనూష ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: Suicide: కరోనా టీకా వేసుకోమన్నారని.. యువకుడు ఆత్మహత్య