నిర్మల్ జిల్లా ముథోల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న ,వారి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు కలగకూడదని ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తున్నామన్నారు. కరోనా వైరస్ సోకకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ముథోల్ నియోజకవర్గంలో మొత్తం దాదాపు 90 వరకు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొక్కజొన్న మద్దతు ధర రూ.1760, వరికి రూ.1835 ప్రభుత్వం కల్పిస్తుందని ఎమ్మెల్యే వివరించారు.