నిర్మల్ జిల్లాలో పోలీసుల నిర్భంద తనిఖీలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వారంరోజుల క్రితం మేడిపెల్లిలో ఎస్పీ శశిధర్ రాజు నేతృత్వంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సరైన వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్‌లు లేకుండా వాహనాలను నడుతున్న100 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్థులకు చెట్లను కాపాడటం, రహదారి నిబంధనలపై అవగాన కలిపించారు. ప్రతి వాహనచోదకుడు వారం రోజుల్లో హెల్మెట్ ధరించి తమకు కనపడాలని వాగ్దానం చేయించారు. అందుకు తగ్గట్లుగా ఆ గ్రామస్థులు మాట నిలబెట్టుకున్నారు.
గ్రామంలోని వాహన చోదకులంతా హెల్మెట్ ధరించి మేడిపెల్లి గ్రామం నుంచి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వీరిని ఎస్పీ అభినందించారు. అలాగే ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని పరిరక్షించాలని సూచించారు.
ఇవీ చూడండి: ఎద్దును తప్పించబోయి ప్రమాదం.. 12 మంది దుర్మరణం