నిర్మల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులతో వర్షం పడింది. గాలి-వాన ధాటికి చేతికొచ్చిన పంట తడిసి ముద్దయింది. వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
కరోనా దెబ్బతో పంట అమ్ముకోవడానికి లేక అన్నదాతలు నానా అవస్థలు పడుతున్న సమయంలో ఈ అకాల వర్షం కోలుకోలేని దెబ్బ తీసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మామిడి కాయలు నేలరాలాయి.