నిర్మల్ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ఎదుట తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ సభ్యులు నిరసన చేపట్టారు. ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని అలాగే వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ నెల 24న దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేపడుతున్నట్లు వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ వివరించారు.
కొవిడ్‌తో మరణించిన ఆశాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.21 వేలు అందజేయాలని కోరారు. అనంతరం సమ్మె నోటీసును వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో గంగామణి, రామలక్ష్మి, భాగ్యలక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: మూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు