ETV Bharat / state

రూ.12.4 లక్షల విలువైన గుట్కా స్వాధీనం - నిర్మల్​ ఎస్పీ శశిధర్​రాజు

నిర్మల్​ జిల్లా సోన్​ మండలంలో సుమారు రూ.12.4 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు సీజ్​ చేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి రవాణ చేస్తున్నట్లు గుర్తించామని ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు.

author img

By

Published : May 24, 2019, 1:17 PM IST

నిర్మల్​ జిల్లా సోన్​ మండలంలో వారం రోజుల్లోనే మరోసారి గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 20న గంజాల్​ టోల్​ ప్లాజా వద్ద సుమారు రూ.22 లక్షల గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు, తాజాగా గురువారం సాయంత్రం రూ.12.4 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను సీజ్​ చేశారు. రాష్ట్రంలో గుట్కాపై నిషేధం విధించడం వల్ల పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించామని ఎస్పీ శశిధర్​రాజు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

రూ.12.4 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

ఇవీ చూడండి: చరవాణిలో చిత్రీకరించి యువకుని బలవన్మరణం

Intro:TG_ADB_31_24_GUTKA PATTIVETA_AVB_G1
TG_ADB_31a_24_GUTKA PATTIVETA_AVB_G1
నిర్మల్ జిల్లాలో మరోమారు గుట్కా పట్టివేత..
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని జాతీయ రహదారిపై వారం తిరగకుండానే మరోసారి నిషేధిత గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 20వ తేదీన సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద దాదాపు 22 లక్షల నిషేధిత గుట్కా ను స్వాధీనం చేసుకోగా తాజాగా నిన్న రాత్రి వాహనాల తనిఖీలు 12 లక్షల 40 వేల విలువగల నిషేధిత గుట్కాను పట్టుకున్నారు. ఈరోజు ఉదయం సొన్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్పి శశిధర్ రాజు వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం నుండి ఆదిలాబాద్ వైపు ఐచర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న సాగర్ ,అంబర్ పేర్లతో గల 82 గన్ని బ్యాగ్ ల నిషేధిత గుట్కాను వాహనాల తనిఖీల్లో భాగంగా పట్టుకోవడం జరిగింది తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు ఈ వాహన తనిఖీలు నిర్వహించినట్లు వివరించారు. కర్ణాటక లో గుట్కాపై నిషేధం లేకపోవడం, తెలంగాణ ప్రభుత్వం గుట్కాను నిషేధం విధించడంతో అక్రమ రవాణా భారీగా సాగుతుందని పేర్కొన్నారు. గుట్కా తరాలిస్తున్నట్లు గాని, గుట్కా వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం తెలిసినట్లయితే 101 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు .నిషేధిత గుట్కా వ్యాపారం ఎవరు కొనసాగించిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
బైట్.. శశిధర్ రాజు ఎస్.పి, నిర్మల్ జిల్లా

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాద్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.