Fancy Number Auction : ఫ్యాన్సీ నంబర్ల రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఆదాయం వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 56 రవాణా శాఖ కార్యాలయాలుండా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఫ్యాన్సీ నంబర్లకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.90 కోట్ల వరకు ఆదాయం లభిస్తే గ్రేటర్ హైదరాబాద్ 3 జిల్లాల రవాణా శాఖ కార్యాలయాల్లో సుమారు రూ.74 కోట్లు ఆదాయం సమకూరడం విశేషం.
ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.100 కోట్లకు చేరుకునే అవకాశముందని రవాణాశాఖ అధికారులు అంచన వేస్తున్నారు. సంపన్నలు అధికంగా ఉండే ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయ పరిధిలో ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ కార్యాలయం సిరీస్ నంబరు 09 కావటంతో ఇక్కడి ఫ్యాన్సీ నంబర్లకు బాగా డిమాండ్. 1, 9, 99, 999, 9999 దక్కించుకునేందుకు వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సంవత్సరం 9999 నంబరుకు ఓ వాహనదారుడు వేలంలో రూ.25.5 లక్షలు వెచ్చించి నంబరును దక్కించుకున్నాడు.
ఫ్యాన్సీ నంబర్ల మోజు : ఖైరతాబాద్ ఆర్టీఏకు కాసుల పంట - ఒక్కరోజులో రూ.52 లక్షలు బిడ్
ఫ్యాన్సీ నంబర్ల కోసం వేలంలో పాల్గొనేందుకు గరిష్ఠ మొత్తం రూ.50 వేలు, అయితే కనిష్ఠంగా రూ.5వేలు. ఫీజు రూపంలో చెల్లించే మొత్తం కన్నా వేలం ద్వారా వచ్చిన అధిక మొత్తం ప్రభుత్వ ఖజానాకు జమ కావడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్‌లో ప్రత్యేక నంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 73,463. ఫీజు రూపంలో రూ.32.57 కోట్లు వస్తే, వేలం ద్వారా ప్రభుత్వానికి అదనంగా సమకూరిన మొత్తం రూ.40.99 కోట్లు.
0001 నంబరుకు రూ.11,11,111 - ఫ్యాన్సీ నంబర్లకు కాసుల వర్షం
మెచ్చిన కారుకు నచ్చిన నంబరు - ఖర్చు విషయంలో అసలు తగ్గేదే లే!