ETV Bharat / state

బాసర ట్రిపుల్​ ఐటీలో విద్యార్థినులపై వేధింపులు - girl student

చదువుల తల్లి క్షేత్రమైన బాసర ట్రిపుల్​ ఐటీలో విద్యార్థినులు వేధింపులకు గురయ్యారు. స్థానికంగా ఉండే జిరాక్స్​ కేంద్ర నిర్వాహకుడు రమేష్​ తమను మానసికంగా వేధించారంటూ వర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

బాసర విద్యాలయం
author img

By

Published : Mar 24, 2019, 2:45 PM IST

బాసరలో విద్యార్థినులపై వేధింపుల ఘటన కలకలం
నిర్మల్​ జిల్లా బాసర రాజీవ్​ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో విద్యార్థినులపై వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక జిరాక్స్​ కేంద్ర నిర్వాహకుడు రమేష్​ విద్యార్థినులతో అసభ్యకరంగా మాట్లాడి వేధిస్తున్నట్లు వర్శిటీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయితే సిబ్బంది విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు.

చర్యలు తీసుకున్నాం..

జిరాక్స్​ సెంటర్​ నిర్వాహకుడు రమేష్​పై ఫిర్యాదులు అందగానే కేంద్రాన్ని మూసివేసి అతన్ని పంపించేశామని యూనివర్శిటీ భద్రత అధికారి అంజయ్య తెలిపారు.

ఇలాంటి ఘటనల వల్ల విద్యార్థినులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇవి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి :గ్రామంలో ఉద్రిక్తత... 144 సెక్షన్ అమలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.