వేద భారతి పీఠం ఆధ్వర్యంలో గంగా జాతర మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. మహా దేవునికి రుద్రాభిషేకం నిర్వహించి వేద మంత్రోచ్ఛారణలతో రుద్రయాగం చేశారు. ఈ కార్యక్రమానికి అశేష భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో తిలకించారు.
అనంతరం వేద విద్యా నందగిరి స్వాములు చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు ప్రసాదం రూపంలో అందించి వారితో సరస్వతి మూల మంత్రాన్ని పఠింపజేశారు. భక్తితో అమ్మవారికి ఉయ్యాల ఊపుతూ పాటలు పాడారు. అనంతరం గోదారమ్మకు నక్షత్ర నాగహారతులను అందించి సాష్టాంగ నమస్కారాలు చేశారు. వేద విద్యా నందగిరి స్వాములు గోదారమ్మ గంగ జాతర విశిష్టతను భక్తులకు వివరించారు.
'వైభవంగా గంగా జాతర మహోత్సవం' - RUDHRA YAAGAM
ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బాసరలో గోదావరి తీరాన గంగా జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం అమ్మవారికి అభిషేకం అలంకరణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు.