ఆరోగ్యకరమైన జీవితానికి వ్యాయామం ఎంతో అవసరమని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం ఉదయం ఏర్పాటు చేసిన 2కే రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో భాగంగా కలెక్టర్ కార్యాలయం నుంచి మినీ స్టేడియం వరకు ర్యాలీ చేపట్టారు.
ప్రత్యేక శ్రద్ధ వహించాలి..
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే చెప్పారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం, ఉదయపు నడక తప్పనిసరి అని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీఈఓ ప్రణీత, జిల్లా యువజన క్రీడాధికారి ముత్తన్న, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు అయ్యన్నగారి భూమయ్య, పీఈటీలు రమేశ్, భోజన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఫిట్ ఇండియాలో భాగంగా.. వరంగల్ నిట్లో 2కే రన్