fire in forest: ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సమీప గ్రామాలైన మరికల, లక్ష్మీపురం, రామకృష్ణాపురం ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక, అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. మంటలు గ్రామాల వైపునకు రాకుండా ఆర్పేందుకు గ్రామస్థులు యత్నించారు.
మంటలకు తోడు ఈదురు గాలులు తోడవడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి: