నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేసిన గంగాభూషణ్ అనే హిందీ ఉపాధ్యాయుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దాదాపు 30 సంవత్సరాలకు పైగా బోధన వృత్తిలో ఉన్న వ్యక్తి కుటుంబం ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటుందని... ఆర్థికంగా పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న విషయం తెలుసుకున్న పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
వాట్సాప్ వేదికగా ఒకరికొకరు సమాచారం చేరవేసుకున్నారు. స్పందించిన మిత్రబృందం 65వేల రూపాయలను జమ చేసి... కుటుంబానికి అందజేశారు. కుటుంబసభ్యులు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్ నవీన్, గాండ్ల నవీన్, ప్రవీణ్‌కుమార్, శేఖర్ తదితరులు ఉన్నారు.
ఇవీ చదవండి: మూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు