ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్.. స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన రైతులు నిరసన చేపట్టారు. గ్రామంలో 200 మంది రైతులుంటే కేవలం 70 మంది దగ్గరే పంటను కొనుగోలు చేశారని ఆరోపించారు. పంటను కోసి ఎన్నో రోజులవుతున్నా కొనుగోలు చేయడం లేదని వాపోయారు.
ఎప్పుడు వర్షమొస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని... వాన కురిస్తే పంట మొత్తం మట్టిపాలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు: సీపీఐ