నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జాం రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు చేసిన వరి ధాన్యం బస్తాలు తరలించాలంటూ నిర్మల్-స్వర్ణ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై రాం నర్సింహారెడ్డి అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు.
ఉన్నతాధికారుల హామీతో రైతులు ఆందోళన విరమించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుకు తరలించే వరకు రైతులదే బాధ్యత. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాల్లో అక్కడే ఉంచడం వల్ల నిన్నటి నుంచి వర్షంతో తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!