ETV Bharat / state

ప్రభుత్వోద్యోగం ఆశచూపి... - government employment

అత్యాశో.. సమర్థతపై అనుమానమో... కొంత మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మధ్యవర్తులను నమ్మి.. లక్షల్లో చెల్లించుకుంటున్నారు. చివరికి మోసపోయామని గుర్తించి లబోదిబోమంటున్నారు. ఇలానే ఓ వ్యక్తి నిర్మల్ జిల్లాలో ఆత్మహత్యాయత్నం చేశాడు.

కొలువులు ఇప్పిస్తామంటూ మోసం
author img

By

Published : Mar 8, 2019, 12:03 PM IST

కొలువులు ఇప్పిస్తామంటూ మోసం
ఆదిలాబాద్​ జిల్లాకు చెందిన లక్ష్మణ్​ వ్యాయమ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. తపాల శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిర్మల్​ జిల్లాకు చెందిన 40 మంది నిరుద్యోగుల నుంచి సుమారు రూ.50 లక్షలు వసూలు చేశాడు. రోజులు గడుస్తున్నా ఎంతకీ పిలుపు రాకపోయేసరికి యవకులు లక్ష్మణ్​ను నిలదీశారు. ఉద్యోగాలు వద్దనుకుంటే డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పి చెక్కులు ఇచ్చాడు. బ్యాంకుకు వెళ్లిన ఆ యువకులు చెక్కులు బౌన్స్​ అయ్యాయని తెలిసి మరింత కుంగిపోయారు. మోసపోయామని గ్రహించి నిర్మల్ జిల్లా సారంగాపూర్​ మండలానికి చెందిన అరవింద్​ పురుగుల మందు తాగి ఆత్నహత్యకు యత్నించారు. హుటాహుటిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.

తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించాలని, నిరుద్యోగులను మోసం చేసిన లక్ష్మణ్​ను కఠినంగా శిక్షించాలని యువకులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:సేంద్రియం @లావణ్య

test file from feedroom
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.