నిర్మల్ జిల్లా కేంద్రంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గల మీ సేవా కేంద్రాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. బీడీ కార్మికుల నుంచి దోపిడి చేస్తున్నారనే వార్త.. 'ఆధార్లో మార్పులకోసం వెళ్తే అందినకాడికి దోచేస్తున్నారు'అనే శీర్షికతో... ఈటీవీ భారత్లో ప్రచురితమైంది. ఈ కథనానికి కలెక్టర్ ప్రశాంతి స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో... నిర్మల్ అర్బన్ తహసీల్దార్ సుభాష్ చందర్ మీ సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు.
నిర్మల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఉండాల్సిన మీ సేవా కేంద్రాన్ని... తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆధార్ కార్డులో పేరు, వయస్సు మార్పు కోసం వెళితే అధిక మొత్తంలో డబ్బులు దండుకుంటున్నట్లు నిర్ధారించారు. దీంతో మీసేవా కేంద్రాన్ని సీజ్ చేసినట్లు తహసీల్దార్ వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆధార్లో మార్పులకోసం వెళ్తే అందినకాడికి దోచేస్తున్నారు