నిర్మల్ జిల్లా ఖానాపూర్కి చెందిన 200 మంది ఎరుకల కులస్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. పందులు పెంచుకుంటూ జీవనోపాధి పొందుతున్న తమ పొట్ట కొట్టొద్దంటూ ధర్నా నిర్వహించారు. ఎలాంటి నోటీసులు లేకుండా మున్సిపల్ అధికారులు తమ పందులను బంధించి బెంగళూరు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. పందుల పెంపకాన్ని వృత్తిగా బతికే 50 కుటుంబాలు మున్సిపల్ అధికారుల చర్యల వల్ల జీవనోపాధి కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. మున్సిపల్ అధికారులు తమకు అన్యాయం చేస్తున్నారని.. ప్రభుత్వం స్పందించాలని కోరారు.
ఇదీ చూడండి: కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!