ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రజల సహకారంతోనే కరోనా వ్యాధి నివారణకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. వలస కూలీలకు వసతి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున ప్రతిఒక్కరూ ఇంటి వద్దే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సామాజిక దూరం పాటించాలన్నారు. నిర్మల్ జిల్లా పాలనాధికారి నేతృత్వంలో 75 మందికి సరిపడే క్వారంటైన్ ఏర్పాట్లు చేశామన్నారు. 15 ఇంటేన్సివ్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇవీ చూడండి: ఆదిలాబాద్ జిల్లాలో 105 మంది విద్యార్థుల అడ్డగింత