ETV Bharat / state

గ్రామ పంచాయతీ కార్యాలయంలో మందు పార్టీ - గ్రామ పంచాయతీ కార్యాలయంలో మందు పార్టీ

గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్​ భర్త ... తన అనుచరులతో కలిసి మందు పార్టీ చేసుకున్నారన్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా ముథోల్ మండలం చించాల గ్రామంలో జరిగింది.

drinking activities in grama panchayat Office of chinchilla at nirmal district
గ్రామ పంచాయతీ కార్యాలయంలో మందు పార్టీ
author img

By

Published : Aug 27, 2020, 8:17 PM IST

నిర్మల్ జిల్లా ముథోల్ మండలం చించాల గ్రామంలో బుధవారం గణేశ్​ నిమజ్జనం సందర్భంగా పంచాయతీ కార్యాలయ ఆవరణలో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం కొందరు పనోళ్లు మద్యం కావాలని అడగ్గా.. సర్పంచ్ భర్త ఇప్పించారని వార్డు మెంబర్​ తెలిపారు. కార్యాలయం బయట మద్యం తాగుతుండగా వర్షం రావడం వల్ల వారు ఆఫీస్​లోకి వచ్చారు. ఆ సమయంలో సర్పంచ్ భర్త అక్కడే ఉన్నామని.. ఈ క్రమంలో కొందరు వచ్చి వీడియో తీశారని పేర్కొన్నారు.

గ్రామ పంచాయతీ కార్యాలయంలో మందు పార్టీ

ఇదంతా వ్యతిరేక వర్గీయులు కావాలనే చేస్తున్నారని... కొందరు ఉదయం నుంచి బెదిరిస్తున్నారని సర్పంచ్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించినట్లు తెలిపారు.

రెండు ఫిర్యాదులపై విచారిస్తున్నాం..

ఆ వీడియో వైరల్ కావడం వల్ల బుధవారం రాత్రి డయల్ 100కి కాల్ వచ్చిందని ముథోల్​​ ఎస్సై తెలిపారు. సిబ్బంది పంచాయతీ కార్యాలయానికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆఫీస్​లో తాగడం తప్పేనని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ప్రతిపక్షం వర్గం.. సర్పంచ్ ఇంటికి వెళ్లి బెదిరించారని ఆమె ఫిర్యాదు ఇచ్చారు. ఈ రెండు ఫిర్యాదులపై విచారిస్తున్నట్లు ఎస్సై వివరించారు.

ఇదీచూడండి: 'సింగిల్​ ఫేజ్ కరెంట్ ఉన్న గిరిజన గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.