నిర్మల్ జిల్లా బాసరలోని స్థానిక సార్వజనిక గణేశ్ మండలి వీధుల్లో జిల్లా ఎస్పీ శశిధర్రాజ్ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 58 ద్విచక్ర వాహనాలు, 7 ఆటోలు, 2 కార్లు, 1 ట్రాక్టరును స్వాధీనం చేసుకున్నారు. సంఘవిద్రోహ శక్తులకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల నిఘా కోసం పెట్రో కారు బృందాలు ఏర్పాటు చేశామన్నారు. సరైన పత్రాలు, హెల్మెట్ ధరించకుండా వాహనాలను నడపొద్దని సూచించారు. కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ రాజేశ్ బల్ల, సీఐ శ్రీనివాస్, ఎస్సై కోదాడ రాజుతో పాటు 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెరాసలో ఓనర్లకు కిరాయిదారులకు గొడవ నడుస్తోంది: భట్టి