ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే చదువుతోపాటు నాయకత్వ లక్షణాలు వస్తాయని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆట) అధ్యక్షులు పరమేశ్ భీంరెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆట, ఏకలవ్య ఫౌండేషన్ - విద్యావాహిని ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ కిట్లు, డెస్క్ బెంచీలను ఉచితంగా పంపిణీ చేశారు.
అలాగే గ్రామస్థులకు ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాలలో చదువుతున్న 300 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ కిట్లు అందజేశారు. సమాజంలో "సేవ డేస్" పేరుతో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రభుత్వ బడి పిల్లలు పిడుగులని, మా దేశంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారందరిలో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వారేనని తెలిపారు.అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి: పలకరింపులు, ప్రారంభోత్సవాలతో సాగిన సీఎం కేసీఆర్ పర్యటన