వీఐపీల సేవలో...
ఆలయ అధికారులు సామాన్య భక్తులను పట్టించుకోకుండా వీఐపీల సేవలో తరించారు. తెలంగాణ ఇరిగేషన్ ఇంజినీర్ భూపతిరాజు నాగేంద్రరావు తన మనుమరాలితో అక్షరాభ్యాసం చేయించి అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకు మునుపు అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక మండపంలో పూజలు నిర్వహించారు.
భక్తుల ఆగ్రహం
ఆలయ అధికారులు వీఐపీలకు అధిక ప్రాధాన్యమిచ్చి తమను నిర్లక్ష్యం చేయడంపై భక్తులు ఆగ్రహం చెందారు. గేటు ముందు నిరసన తెలిపారు. పరిస్థితిని గమనించిన ఆలయ అధికారులు 27 నిమిషాలు ఆలస్యంగా భక్తులను అనుమతించారు.
ఇదీ చదవండి :నెక్లెస్‌రోడ్డులో భాజపా రన్ ఫర్ మోదీ