నిర్మల్ జిల్లా కేంద్రంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో శ్రీ గండి రామన్న సాయిబాబా ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం సాయి పల్లకిని పుర వీధుల గుండా ఊరేగించారు. ఈ శోభాయాత్రలో సాయి భక్తులు, విద్యార్థులు నృత్యాలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. సాయిబాబా వేషధారణతో ఓ భక్తుడు పట్టణ వాసులను ఆకట్టుకున్నాడు.
ఇవీ చూడండి: పోలీసులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ