శీతాకాలం పండుగా పరిగణించే సీతాఫలం పోషకాల సమాహారం. మరెన్నో సుగుణాలున్న పండు ఏడాదిలో రెండు నెలలు మాత్రమే లభిస్తుంది. ఇవి మార్కెట్లోకి ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు ప్రజలు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద అమృతఫలాలు స్థానికులను ఊరిస్తున్నాయి. ఒక్కో పండు రూ.20 నుంచి 40 వరకు ధర పలుకుతున్నా స్థానికులు వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇదీ చదవండిః వేప చెట్టుకు సీతాఫలం...క్యూ కట్టిన జనం