ETV Bharat / state

'విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే పోటీలు'

author img

By

Published : Dec 20, 2020, 7:56 PM IST

విద్యార్థులు చదువులో నైపుణ్యం పెంపొందించుకోవాలని గురుకుల పాఠశాలల నిర్మల్​ జిల్లా సమన్వయ అధికారి సరస్వతి అన్నారు. 'మన ఊరికి మన గురుకులం' కార్యక్రమంలో భాగంగా సోన్​ మండల కేంద్రంలో సాంస్కృతిక పోటీలు నిర్వహించారు.

culturrel Competitions to show the talent of students
'విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే పోటీలు'

విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు గురుకుల పాఠశాలల నిర్మల్​ జిల్లా సమన్వయ అధికారి సరస్వతి తెలిపారు. 'మన ఊరికి- మన గురుకులం' కార్యక్రమంలో భాగంగా సోన్​ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో వ్యాసరచన, ఉపన్యాస, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు.

పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతితో పాటు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడుతాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వినోద్ కుమార్, ఉపసర్పంచ్ రాజేశ్వర్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరీంనగర్​ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా: కమలాకర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.