ETV Bharat / state

క్రీడాకారులకు అన్నివిధాలా ప్రోత్సాహం: ఇంద్రకరణ్​ రెడ్డి - క్రీడలను ప్రోత్సహిత్సమన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

రాష్ట్రంలో క్రీడాకారులకు అన్ని విధాలుగా ప్రోత్సహిత్సమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్​ మినీ స్టేడియంలో క్రికెట్​ నెట్​ ప్రాక్టీస్​ కోర్టు​, ఓపెన్​ జిమ్​ను ఆయన ప్రారంభించారు.

cricket net practice court and jim opened by  minister indrakaran reddy
క్రీడాకారులకు అన్నివిధాలా ప్రోత్సాహం: ఇంద్రకరణ్​ రెడ్డి
author img

By

Published : Jan 2, 2021, 2:36 PM IST

క్రీడాకారులకు అవసరమైన అన్ని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఉండాలంటే క్రీడలతో పాటు వ్యాయామం అవసరమని మంత్రి తెలిపారు. నిర్మల్​ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్​ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రికెట్​ నెట్​ ప్రాక్టీస్​ కోర్టు, ఓపెన్​ జిమ్​ను ఆయన ప్రారంభించారు.

మంత్రి కాసేపు సరదాగా క్రికెట్​ ప్రాక్టీస్​ చేసి, వ్యాయామం చేస్తూ సందర్శకులను ఆకట్టుకున్నారు. జిల్లా క్రీడా ప్రాంగణం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. భవిష్యత్​లో స్టేడియం ముందు దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసి, ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతామని తెలిపారు. జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్​ విజయలక్ష్మి, పురపాలక ఛైర్మన్​ ఈశ్వర్, పాలనాధికారి ముషారఫ్​ ఫారూఖీ, అదనపు కలెక్టర్​, హేమంత్​ బొడ్కరే, ఎఫ్​ఎస్​సీఎస్​ ఛైర్మన్​ ధర్మాజీ రాజేందర్​ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.