ETV Bharat / state

MIM MLA Akbaruddin: అక్బరుద్దీన్‌ నిర్దోషి.. తేల్చిన ప్రజాప్రతినిధుల న్యాయస్థానం

MIM MLA Akbaruddin: విద్వేషపూరిత ప్రసంగం చేశారని నమోదైన కేసుల్లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ని నాంపల్లి ప్రజాప్రతినిధుల న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

MIM MLA Akbaruddin: అక్బరుద్దీన్‌ నిర్దోషి.. తేల్చిన ప్రజాప్రతినిధుల న్యాయస్థానం
MIM MLA Akbaruddin: అక్బరుద్దీన్‌ నిర్దోషి.. తేల్చిన ప్రజాప్రతినిధుల న్యాయస్థానం
author img

By

Published : Apr 13, 2022, 3:10 PM IST

Updated : Apr 13, 2022, 7:14 PM IST

MIM MLA Akbaruddin: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారన్న కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నిర్దోషిగా తేల్చింది. కేసులకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేనందున కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఇకముందు ఇలాంటి ప్రసంగాలు చేయకుండా చూడాలని అక్బర్ తరఫు న్యాయవాదిని అజీమ్​ను న్యాయమూర్తి హెచ్చరించారు. నిర్దోషిగా తేల్చినంత మాత్రాన సంబురాలు చేసుకునే సమయం కాదిదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

అసలేం జరిగిందంటే.. 2012 డిసెంబర్ 8న నిజామాబాద్​లో, అదే ఏడాది 22న నిర్మల్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ ఎమ్మెల్యే అక్బరుద్దీన్​పై వేర్వేరు కేసులు నమోదయ్యాయి. 2013 జనవరి 2న నిర్మల్ పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. నిజామాబాద్​లో నమోదైన కేసును అప్పటి ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. నిర్మల్ పోలీసులు అక్బరుద్దీన్​ను 2013 జనవరి 8వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఫిబ్రవరి 16వ తేదీన బెయిల్​పై విడుదలై బయటికి వచ్చారు. ఈ కేసులను వేర్వేరుగా దర్యాప్తు చేపట్టిన నిర్మల్ పోలీసులు, సీఐడీ అధికారులు 2016లో నేరాభియోగపత్రం దాఖలు చేశారు. నిజామాబాద్​లో అక్బరుద్దీన్​ ప్రసంగాన్ని సీఐడీ అధికారులు చండీగడ్ లోని సీఎఫ్ఎస్ఎల్​కు పంపారు. విద్వేషపూరిత ప్రసంగంలో ఉన్నది అక్బరుద్దీన్ గొంతేనని సీఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చింది. ఈ నివేదికను సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. నిర్మల్ పోలీసులు నమోదు చేసిన కేసులో న్యాయస్థానం 30మందికి పైగా విచారించింది. సీఐడీ కేసులో 43మందిని విచారించారు. రెండు కేసుల్లోనూ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో న్యాయమూర్తి కేసులను కొట్టేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 13, 2022, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.