కరోనా మహమ్మారి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. నిర్మల్ జిల్లా భైంసాలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. గురుకుల పాఠశాలలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. పాఠశాలలో తొమ్మిది మంది విద్యార్థులకు సోకగా.. సిబ్బందిలో ఒకరు వైరస్ బారిన పడినట్లు వైద్యులు తెలిపారు.
నిర్మల్ జిల్లా భైంసాలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో కొవిడ్ అలజడి సృష్టించింది. స్కూల్లో 14 మందికి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించగా... పది మందికి పాజిటివ్ అని తేలింది. పాఠశాలలో కేసులు నమోదు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం... కొవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్లు వెల్లడించింది.