కొవిడ్ మహమ్మారి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని బొప్పారం పంచాయతీ ఆవరణలో కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఐకేపీ సిబ్బంది అవగహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ గ్రామంలోని ప్రజలు మాస్కులు ధరించాలని జెడ్పీటీసీ సభ్యులు జీవన్ రెడ్డి సూచించారు.
అలాగే భౌతిక దూరం పాటించాలని కోరారు. అనంతరం ప్రజలచేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హరిత, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ఉషారాణి, ఎంపీఓ అశోక్, మంజుల, సులోచన తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'కరోనా నియంత్రణలో వచ్చే మూడు నెలలు అత్యంత కీలకం'