నిర్మల్ జిల్లా కేంద్రంలోని కళానగర్లోని కందకం పూడ్చివేత వివాదాస్పదంగా మారింది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తమకు పట్టా ఉందంటూ కందకంలోని ఓ భాగంలో మట్టినింపడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఈ స్థలం తనకే చెందుతుందంటూ కోర్టు ఆర్డర్ ఉందని తెలపడం పట్ల స్థానికులు నివ్వెరపోయారు.
అధికారులకు ఫిర్యాదు..
ఈప్రాతంలో 45 ఏళ్లుగా కందకం చూస్తున్నామని.. కొత్తగా ఇప్పుడు పట్టా వచ్చిందని చెప్పడం పట్ల స్థానిక కాలనీల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కందకం పూడ్చివేత అపాలని కోరుతున్నారు. ఈ మేరకు పురపాలకశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఉత్తర్వుపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ బాలక్రిష్ణ హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు