నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ వర్షానికి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చేతికి వచ్చిన శనగ పంట, పత్తి పంట, మరి కొద్ది రోజుల్లో వచ్చే జొన్నపంటలు వానకు నేలరాలాయి.
అధిక వర్షాలతో మొదటి పంటలో అనుకున్నంత దిగుబడి రాకపోవడంతో రెండో పంటపై రైతన్నలు ఆశలు పెట్టుకున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో అనుకోకుండా కురిసిన వాన.. వారిని ఆందోళనలకు గురిచేస్తోంది. దాదాపు 40 శాతం వరకు శనగ పంట దెబ్బతిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: బంజారాహిల్స్లో చీపురు పట్టిన ట్రాఫిక్ పోలీసులు