నిర్మల్ జిల్లా కేంద్రంలోని జహురానగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించాడు. మృతి చెందిన వ్యక్తి ఇటీవల దిల్లీలో జరిగిన మత ప్రచార సభలో పాల్గొన్నారు. అనారోగ్యంతో వెళ్లి చికిత్స పొందుతూ మృతి చెందడం వల్ల కరోనా అయి ఉండొచ్చని అనుమానాలు తలెత్తాయి.
ఫలితంగా జిల్లా పాలానాధికారి ముషారఫ్ అలీ ఫారూకీతో పాటు రెవెన్యూ, వైద్య, పోలీస్ అధికారులు మృతుడి కాలనీని సందర్శించారు. కాలనీలో క్లోరినేషన్ చేపట్టారు. మృతుడి కుటుంబీకులను 8మందిని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. కాలనీ మొత్తాన్ని దిగ్బంధం చేసి... కరోనా కాలనీగా ప్రకటించారు. కాలనీవాసులు ఎవరూ బయటకు రాకూడదని ఆదేశాలు జారీచేశారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఆ సొరంగంలో నడిస్తే కరోనా వైరస్ హతం