ETV Bharat / state

పల్లె ప్రగతి పనులను వెంటనే పూర్తి చేయండి : కలెక్టర్ - నిర్మల్ కలెక్టర్ వార్తలు

నిర్మల్‌ జిల్లాలో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన శ్మాశాన వాటికలు, రైతు వేదికల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. రైతు వేదిక ప్రాంగణంలో పచ్చదనం పెంపొందేలా విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. నిర్మాణ పనుల పురోగతిని ప్రతిరోజు పర్యవేక్షించాలని పేర్కొన్నారు.

NIRMAL COLLECTOR
NIRMAL COLLECTOR
author img

By

Published : Sep 29, 2020, 7:38 PM IST

నిర్మల్ జిల్లాలో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పల్లె ప్రగతి పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా నిర్మాణ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన శ్మాశాన వాటికలు, రైతు వేదికల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకుగానూ ఇప్పటివరకు 139 శ్మాశాన వాటికల నిర్మాణం పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 582పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాకు మంజూరైన 79 రైతు వేదికలకు గానూ ఇప్పటివరకు చిట్యాల, హంపోలి, తాండ్రలో నిర్మించినట్లు వెల్లడించారు. మిగతా చోట్ల నిర్మాణంలో ఉన్నాయన్నారు. కూలీల సంఖ్యను పెంచి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రైతు వేదిక ప్రాంగణంలో పచ్చదనం పెంపొందేలా విరివిగా మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణ పనుల పురోగతిని ప్రతిరోజు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. నాణ్యత లోపిస్తే సహించేది లేదని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఇంఛార్జీ డీఆర్‌వో రాఠోడ్ రమేశ్‌, జడ్పీ సీఈవో సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : గ్రేటర్​లో మంచి పేరుంది.. కనీసం 91 సీట్లు గెలుస్తాం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.