ETV Bharat / state

'మిడతల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలి'

నిర్మల్​ కలెక్టరేట్​లో జిల్లా కలెక్టర్​ ముషారఫ్​ ఫారూఖీ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిడతల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

collector review on controllig of locust in nirmal district
'మిడతల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి'
author img

By

Published : May 29, 2020, 6:08 PM IST

మిడతల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్​ ఫారూఖీ వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. నిర్మల్​ కలెక్టరేట్​లో మిడతలను అదుపు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.జిల్లాలో మిడతల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో మిడతలు ఉన్నాయని, అవి ఏ సమయంలోనైనా తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందన్నారు.

జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ డివిజన్లలో ప్రతి డివిజన్​కు ఒక ఫైర్ ఇంజన్, 5 ట్యాంకర్ల చొప్పున నీటిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మిడతలపై పిచికారీ చేసే మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. డివిజన్ల వారీగా ఇన్​ఛార్జీలుగా వ్యవసాయ శాఖ అధికారులను నియమించాలన్నారు. అధికారులందరు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్​లో ఉండాలని, సమస్యను ఎదుర్కొనేందుకు పగలు,రాత్రి అప్రమత్తంగా ఉండాలని సూచించారు . ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్ రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి శరత్ కుమార్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: పక్షుల దాహం తీరుస్తున్న కొత్త ఆలోచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.