జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలని నిర్మల్ కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫారూఖీ.. వైద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాధారణ ప్రసవాలపై ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు, వైద్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన కచ్చితంగా పాటించాలన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో మండలాల వారీగా ఇప్పటి వరకు జరిగిన ప్రసవాలపై నివేదిక తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. సాధారణ ప్రసవాలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన వైద్యులు, వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: గురుకులాల్లో కరోనా అలజడి.. విద్యార్థులపై కొవిడ్ గురి