ETV Bharat / state

పట్టణ ప్రగతిని పకడ్బందీగా చేపట్టండి: కలెక్టర్‌ - నిర్మల్‌ కలెక్టర్‌ ముషర్రఫ్‌ తాజా వార్తలు

పట్టణ ప్రగతిలో భాగంగా నిర్మల్‌ జిల్లా కలెక్టరేట్‌లో మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్‌ ముషర్రఫ్‌ ఫారూఖీ సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లో సుందరీకరణ పనులను ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆస్తిపన్ను వసూళ్లు, పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

urban progress, nirmal collector musharraf
పట్టణ ప్రగతి, నిర్మల్‌ కలెక్టర్‌ ముషర్రఫ్‌
author img

By

Published : Feb 4, 2021, 12:48 PM IST

నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతిలో భాగంగా అభివృద్ధి పనులను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.. అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. బుధవారం.. కలెక్టరేట్‌లో పట్టణ ప్రగతిపై మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రగతిలో భాగంగా సుందరీకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఆస్తి పన్ను వసూళ్లతో పాటు పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఆటోల ద్వారా ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరణ, రోడ్లు, వీధుల్లో పరిసరాల పరిశుభ్రత, వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

పట్టణ పార్కుల ఏర్పాటు

హరితహారంలో భాగంగా పట్టణ పార్కుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని, ప్రతి వార్డులో ట్రీ పార్కు, నర్సరీలను ఏర్పాటుచేసి పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. సమీకృత మార్కెట్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించి పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న లే ఔట్లను, భవనాలను నిలిపివేయాలని ఆదేశించారు. అనంతరం నూతన మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, వార్డు కౌన్సిలర్ల విధులు, బాధ్యతలపై సెక్షన్ల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ సుదీర్ఘంగా వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ ఛైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, జాబీర్ అహ్మద్, రాజేందర్, కమిషనర్లు ఎన్.బాలకృష్ణ, ఎంఏ ఖాదీర్, గంగాధర్, కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'పేట్లబురుజు​'.. దేశంలోనే ఉత్తమ పోలీస్ ట్రైనింగ్ సెంటర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.