ETV Bharat / state

భైంసాలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సుడిగాలి పర్యటన - తెలంగాణ వార్తలు

నిర్మల్ జిల్లా భైంసాలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ పర్యటించారు. పలు కాలనీల్లో తిరుగుతూ.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ కార్యాలయ సమీపంలో కూరగాయలు విక్రయించే వారితో ముచ్చటించారు.

collector musharraf ali farooqi visit, bhanisa in nirmal district
కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, భైంసాలో కలెక్టర్ పర్యటన
author img

By

Published : Mar 26, 2021, 2:17 PM IST

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయ సమీపంలో కూరగాయలు విక్రయించే వారితో మాట్లాడి... వారి వివరాలు అడిగి తెలుకునున్నారు. 'ధరలు ఎలా ఉన్నాయి?, లాభాలు వస్తున్నాయా?' అని ప్రశ్నించారు. తాము సాయంత్రం 5గంటల వరకే అమ్ముతున్నామని... కొంచెం సమయాన్ని పొడిగించాలని కలెక్టర్‌కి విన్నవించారు.

అనంతరం పట్టణంలోని కోర్భగల్లీ, గణేశ్ నగర్, జుల్పకర్ గల్లీల్లో పర్యటించారు. జుల్ఫకర్ గల్లీలో బందోబస్తులో ఉన్న పోలీసులతో మాట్లాడారు. రాహుల్ నగర్‌లోని వైకుంఠధామాన్ని పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్యులను తొలగించాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.