Child Marriage in Nirmal : ఆడపిల్లల సంరక్షణ కోసం అనేక చట్టాలు తెచ్చినా ప్రజల్లో మాత్రం ఎలాంటి బాధ్యత లేకుండా పోతోంది. బాల్యవివాహాలు జరగకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా వాటికి అడ్దుకట్టవేయలేక పోతున్నారు. డబ్బుల కోసం ఆశ పడి, ఆడపిల్ల పెద్దై తమ భుజాలపై భారంగా ఉంటుందని తెలిసితెలియని వయస్సులో పసి జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా కాసుల కోసం కక్కుర్తి పడి 14 ఏళ్ల బాలికకు బలవంతంగా పెళ్లి చేశారు ఆమె తల్లి, మేనమామ. తనకు ఇష్టం లేదని.. చదువుకుని మంచి ఉద్యోగం చేస్తానని తల్లిదండ్రులతో ఆ బాలిక మొరపెట్టుకున్నా వినకుండా ఆమెను కొట్టి మరీ పెళ్లి చేశారు. అయితే ఆ బాలిక మాత్రం ఆ నరకం నుంచి బయటపడాలని నిశ్చయించుకుంది. అదును దొరకగానే అక్కడి నుంచి బయటపడి సర్పంచ్ సాయంతో పోలీసులకు వారిపై ఫిర్యాదు చేసింది.
Child Marriages in Telangana : బలవంతపు బాల్యవివాహాన్ని నిరాకరించిన బాలిక సర్పంచ్ సహాయంతో అధికారులకు ఫిర్యాదు చేసంది. నిర్మల్ జిల్లాలోని కుంటాల మండలంలో ఈ ఘటన వెలులోకి వచ్చింది. కుంటాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓలా గ్రామానికి చెందిన దంపతులకు 14ఏళ్ల కుమార్తె ఉంది. కుటుంబ సభ్యులు పది రోజుల క్రితం నిర్మవ్ గ్రామీణ మండలంలోని కొండపూర్ గ్రామానికి చెందిన దాసరి నగేష్(33)తో తమ కుమార్తెతో బలవంతంగా నిశ్చితార్థం(Child Marriage) జరిపించారు.
బర్త్‌డే పేరుతో.. 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి
ఆదివారం నగేష్ స్వగ్రామంలో ఇద్దరికీ వివాహం జరిపించారు. పెళ్లి అనంతరం కార్యక్రమాల్లో భాగంగా అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులంతా ఓలా గ్రామానికి చేరుకున్నారు. సోమవారం పొద్దున దావత్‌లో భాగంగా భర్త సహా కుటుంబ సభ్యులంతా మద్యం తాగేందుకు బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన బాలిక గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లింది. సర్పించ్ ఫాతిమాను కలిసింది. తనకు వివాహం ఇష్టం వేదని... తన తల్లి.. మేనమామ వరుడి కుటుంబ సభ్యుల వద్ద రూ. 25వేలు తీసుకుని తనని కొట్టి పెళ్లికి (Child Abuse) ఒప్పించారని తెలిపింది.
మేడ్చల్లో బాల్యవివాహం - కేసు నమోదు
సర్పంచ్.. పోలీసులకు, ఐసీడీఎస్ సూపరింటెండెంట్ లక్ష్మీ విశారదకు సమాచారమిచ్చారు. వారు అమ్మాయి ఇంటికి చేరుకుని ఇరు వైపుల కుటుంబ సభ్యులను విచారించారు. బాలిక వయస్సు ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. యువకుడికి గత నెలలోనే మొదటి పెళ్లి జరిగినట్లు తెలుసుకొని షాక్ అయ్యారు. సంతానం కలగదని తెలవడంతో అతను మొదటి భార్యతో తెగదెంపులు చేసుకున్నారని తేలింది. నెల రోజుల వ్యవధిలోనే రెండో పెళ్లిగా ఈ 14 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడని తేలింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అనంతరం బాలికను ఐసీడీఎస్ అధికారులు నిర్మల్ సఖీ కేంద్రంలో చేర్పించారు.